- Advertisement -
నవతెలంగాణ-కరీంనగర్
తెలంగాణ మెడికల్, సేల్స్ రిప్రజెంటేటీవ్స్ యూనియన్ (సీఐటీయూ) కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా సేవలందించిన జేఎల్.నరసింహారెడ్డి సోమవారం గుండెపోటుతో మృతి చెందారు. పదేండ్లు యూనియన్ జిల్లా అధ్యక్షునిగా సేవలందించిన ఆయన జిల్లా కార్యదర్శిగానూ, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగానూ పని చేశారు. కరీంనగర్‌లో యూనియన్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. ఆయన మృతి పట్ల యూనియన్ జిల్లా కార్యదర్శి అంజయ్య, సీఐటీయూ నాయకులు సంతాపం తెలిపారు.
- Advertisement -