ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి..

నవతెలంగాణ – అశ్వారావుపేట

నవభారత నిర్మాత నవ యువతకు స్ఫూర్తి ప్రదాత భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి ని ఆదివారం అశ్వారావుపేట లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జ్యేష్ఠ సత్యనారాయణ చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వయో వృద్ధులకు అనాధలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసారు.

ఈ కార్యక్రమంలో సత్యనారాయణ చౌదరి మాట్లాడుతూ నవ యువతకు స్ఫూర్తి ప్రదాత యువతకు అన్ని రంగాల్లో అభివృద్ధి అభివృద్ధికి కృషి చేసిన నిత్య కృషీవలుడు యువతకు ప్రాధాన్యతనిస్తూ 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించిన ప్రగతి ప్రదాత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుంకవల్లి వీరభద్ర రావు, బత్తిని పార్థసారధి, అనంతారం సర్పంచ్ దాసరి నాగేంద్రరావు, మొగలి రాంబాబు,మాజీ సర్పంచ్ పొట్టా రాజులు,గుర్రం వెంకటేష్, రత్నం, భూక్యా రామారావు, యూత్ కాంగ్రెస్ నాయకులు తమ్మిశెట్టి పోసి,అకిరిపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు
Spread the love