
సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సీట్ల కేటాయింపులో మాలలకు తీవ్ర అన్యాయం జరిగిందని మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ్ల నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ మేరకు మంగళవారం నిజామాబాద్ నగరంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 60 నుంచి 65 లక్షల దళితుల జనాభా ఉందన్నారు.కాగా మాలలకు కేవలం 7 సీట్లు మాత్రమే కేటాయించడం జరిగిందన్నారు.జనాభా ప్రాతిపదికన మాలలకు తక్కువ సీట్లు కేటాయించడం సరికాదన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మిగిలిన 4జనరల్ సీట్లను మాలలకు కేటాయించాలని డిమాండ్ చేశారు