Friday, May 9, 2025
Homeతెలంగాణ రౌండప్మంథని అభివృద్ధి కనిపించడం లేదా.?

మంథని అభివృద్ధి కనిపించడం లేదా.?

- Advertisement -

బిఆర్ఎస్ నాయకులు 
నవతెలంగాణ – మల్హర్ రావు
: మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో మండలంలో చేసిన అభివృద్ధి కాంగ్రెస్ నాయకులకు కనిపించడం లేదాని ప్రశ్నించారు. గురువారం పెద్దతూoడ్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు పదేళ్ళలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ మండలంలో అభివృద్ధి చేయలేదని ఆరోపించిన కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.తమ నాయకుడు ఐదేళ్లలో ఖమ్మంపల్లి బ్రిడ్జి,భూపాలపల్లి రోడ్డు,శాత్రజ్ పల్లి,పెద్దతూoడ్ల వాగులపై బ్రిడ్జిలు నిర్మాణం చేసినట్లుగా గుర్తు చేశారు.కాంగ్రెస్ పార్టీ మేనిపేస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.కిషన్ రావుపల్లి రోడ్డుకు అటవీశాఖ  అనుమతులు తీసుకరాలేదనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు నారా రమేష్, మాజీ సర్పంచ్ విజయ-నాగేశ్వరరావు,బీఆర్ఎస్ నాయకులు గాధం సుధాకర్ జక్కుల లక్ష్మయ్య, బండారి సమ్మయ్య, తోట బాపు, బండారి శ్రీనివాస్, పర్సవేన సంపత్, పెండ్యాల రాజు, రఘువరన్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -