- Advertisement -
నవతెలంగాణ-ఆర్మూర్
పట్టణంలోని పెద్ద బజార్ నందు మొహరం సందర్భంగా శుక్రవారం సూర్యవంశ ఆరెకటిక సంఘం , కాలనీవాసుల సమక్షంలో ఎన్నో వందల చరిత్ర గల మొహరం పండుగను ఘనంగా నిర్వహించినారు. ఉదయం నుండి భక్తులు అధిక విచ్చేసి బెల్లంతో చేసిన మలిదముద్దలు సమర్పించుకొని తమ తమ ముక్కులను చెల్లించుకున్నారు పెద్ద బజార్ నుండి జమ్మంశెట్టి గల్లి కింది బజార్ గోల్బంగ్లా మీదుగా పాత బస్టాండ్ నుండి మళ్ళీ బాజీని దర్గాకు చేరుకొని అక్కడి నుండి మళ్ళీ గుట్ట పైకి విచ్చేసి భక్తుల సమక్షంలో పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో 29వ వార్డ్ కౌన్సిలర్ తిరుమల సుమన్ , అజయ్, ప్రమోద్, విజయ్ బబ్లు రాజేందర్ గణేష్ కిశోర్ పెద్దలు అరుణ్ కాలనీవాసులు పాల్గొన్నారు.
- Advertisement -


