నవీపేట్ లో ఘనంగా ఎంపీ అరవింద్ జన్మదిన వేడుక

నవతెలంగాణ- నవీపేట్: పార్లమెంట్ సభ్యులు ఎంపీ అరవింద్ జన్మదినం సందర్భంగా బిజెపి ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి దర్యాపూర్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంతో పాటు జన్నేపల్లి చౌరస్తాలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ ఎంపీ అరవింద్ నిరంతరం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారని జన్మదినం సందర్భంగా 50 లక్షలతో సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాదా ప్రధాన కార్యదర్శులు ఆనంద్, రాజేందర్ గౌడ్, బీజేవైఎం నాయకులు పిల్లి శ్రీకాంత్, రాజశేఖర్, రాము, శ్రీనివాస్ గౌడ్, గుర్రపు రవి, గణేష్, భూషణ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love