నవతెలంగాణ- రెంజల్
రెంజల్ మండలం గండిగుట్ట గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి సర్పంచ్ ముళ్ళపూడి శ్రీదేవి కృష్ణారావు, ఉప సర్పంచ్ జగదీష్ లు భూమి పూజ నిర్వహించారు. ఎన్ఆర్ఈజీఎస్ నుంచి 20 లక్షల రూపాయలు మంజూరు కాగా అట్టి నిధులతో వారు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో రెంజల్ సర్పంచి ఎమ్మెస్ రమేష్ కుమార్, కళ్యాపూర్ మాజీ సర్పంచ్ మైని మోహన్, ఎంపీడీవో శంకర్, ఎం పి ఓ గౌసుద్దీన్, పి ఆర్ ఏ ఈ వినయ్ కుమార్, స్థానిక నాయకులు దత్తు కిష్టయ్య, వెంకటేశ్వరరావు, నరసింహారెడ్డి, పాలకవర్గ సభ్యులు, గ్రామ కార్యదర్శి గౌతమి, అంగన్వాడి ఆశలు పాల్గొన్నారు.