
మండల కేంద్రంలోని రక్షాబంధన్ కన్నుల పండగ జరిగింది.భారతీయ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతిరూపంగా భావించే రక్షాబంధన్ వేడుకను గురువారం రోజున మండల వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఆడపడుచులు పుట్టింటికి చేరుకుని తమ సోదరులకు ప్రేమతో, కలకాలం సంతోషంగా జీవించాలని ఆకాంక్షిస్తూ రాఖీలు కట్టి దీవించారు. దీనికి ప్రతిగా సోదరులు నూతన వస్త్రాలు, బహుమతులను కానుకగా అందజేశారు.