- Advertisement -
- – రూ.32 లక్షలతో పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన..
- నవతెలంగాణ – సారంగాపూర్
- ఎత్తిపోతల పథకం తో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. మండలంలోని స్వర్ణ నది పరివాహక ఆలూరు గ్రామ ప్రాంతంలో గల ఎత్తిపోతల పథకం రూ.32 లక్షల తో పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా పునరుద్ధరణ నోచుకోక రైతులు నష్టపోయారన్నారు. రబీ పంటకు నీరందేలా సంబంధిత కాంట్రాక్టర్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
- ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రావుల రామ్ నాథ్, వడ్డే రాజేందర్ రెడ్డి, గంగారెడ్డి, రామ్ శంకర్ రెడ్డి, బీజేపీ మండల అద్యక్షులు కాల్వ నరేష్ ,శ్రావణ్ కుమార్, సాహెబ్ రావు, పతాని నర్సయ్య, బడిపోతన్న, గణపతి, చిన్నయ్య, మదు, భోజాన్న, ఎల్లన్న, విలాస్,తిరుమల చారి, రజిత్, విజయ్, లక్ష్మన్, అంబాజీ, కార్యకర్తలు గ్రామ రైతులు పాల్గొన్నారు.
- Advertisement -