– మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మెరుగైన వ్యవసాయ ఉత్పత్తుల కోసం కృషి చేయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోరారు. మంత్రి అమెరికా పర్యటనలో భాగంగా ఐదో రోజు మేరీ ల్యాండ్ విశ్వవిద్యాలయంను సందర్శించారు. వాషింగ్టన్ డీసీలోని ఐఎఫ్ పీఆర్‌ఐ ప్రధాన కార్యాలయంలో సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ శాఖ సెక్రెటరీ రఘునందన్ రావు, , తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు పాల్గొన్నారు.