ఐసిఐసిఐ ప్రూ గిప్ట్‌ ప్రో పాలసీ విడుదల

ముంబయి: ఐసిఐసిఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కొత్తగా ఐసిఐసిఐ ప్రూ గిఫ్ట్‌ ప్రోను విడుదల చేసినట్లు తెలిపింది. ఏక మొత్తం ప్రయోజనాలతో పాటు సాధారణ ఆదాయాన్ని అందించేలా ఈ పాలసీని రూపొందించినట్లు పేర్కొంది. ప్రతి సంవత్సరం పెరుగుతున్న ఆదాయాన్ని లేదా స్థిరమైన ఆదాయాన్ని పొందే అవకాశాన్ని అందిస్తుందని తెలిపింది. కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పిస్తుందని పేర్కొంది. ఐసిఐసిఐ ప్రూ గిఫ్ట్‌ ప్రో 5 నుండి 12 సంవత్సరాల వరకు ప్రీమియం చెల్లింపు నిబంధనల శ్రేణిని అందిస్తుంది. 8వ సంవత్సరం నుండి వారు 30 సంవత్సరాల వరకు ఆదాయాన్ని పొందడం ప్రారంభించవచ్చని ఐసిఐసిఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చీఫ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసర్‌ అమిత్‌ పాల్టా పేర్కొన్నారు.

Spread the love