- Advertisement -
నవతెలంగాణ-రాజోలి: రాజోలి మండలంలో ఇసుక మాఫియా ప్రేటేగి పోతుంది. పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరాయంగా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. తుంగభద్రనది తీరం నుంచి రాత్రివేళలో ఎలాంటి అనుమతులు లేకుండానే భారీ మొత్తంలో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారని స్థానికలు ఆరోపిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో ఇసుకను డప్పింగ్ చేసి.. మిని టీప్పర్ల ద్వారా పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధిక మొత్తంలో ఇతరలకు అమ్ముతూ అధిక లాభాలను గడిస్తూ..ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపెడుతున్నారు. సంబంధింత అధికారులు నిఘా పెంచి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
- Advertisement -