నవతెలంగాణ – బీహార్
బీహార్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆరుగురు కామాంధులు ఓ బాలికను 28 రోజుల పాటు చెరపట్టి అఘాయిత్యానికి ఒడిగట్టారు. ముజఫర్‌పూర్‌లో సరైయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. గత నెల 9న కొందరు దుండగులు కారులో వచ్చి ఓ 13 ఏండ్ల బాలికను కిడ్నాప్ చేశారు. శిథిలావస్థకు చేరుకున్న ఓ భవనంలో ఆమెను బంధించి ఆరుగురు వ్యక్తులు 28 రోజుల పాటు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక ఆరోగ్యం విషమించడంతో ఆగస్టు 5న ఆమె తల్లికి ఫోన్ చేసి చిన్నారిని కిడ్నాప్ చేసిన విషయాన్ని వెల్లడించారు. వెంటనే అక్కడకు చేరుకున్న మహిళ తన కూతురిని ఆసుపత్రికి తరలించింది. జులై 9న తాను ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు వేగంగా స్పందించి ఉంటే తన కూతురికి ఈ గతి పట్టేది కాదంటూ ఆ మాతృమూర్తి గుండెలవిసేలా రోదించడం అక్కడి వారిని కదిలించింది. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.