
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్
నందనం గ్రామం నుండి సిరివేణికుంటకు వెళ్లి దారిలో అసంపూర్తిగా ఉన్నటువంటి బ్రిడ్జిని వెంటనే ప్రారంభించాలని, చెరువు కింద ఉన్నటువంటి రైతులకు ఉపయోగపడే దారిలో పెరిగిన కంపచెట్లను తొలగించి దారిని ఏర్పాటు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి దయ్యా నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నందనం గ్రామ పంచాయతీ సెక్రెటరీకి వినతి పత్రం అందజేసి , మాట్లాడారు. గ్రామంలో చాలామంది నిరుపేదలకు ఇండ్లు లేక ఉన్నారని ప్రభుత్వము ఇల్లు లేని పేదలందరికీ ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, అర్హత కలిగిన పేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, ఇంకా అర్హత ఉండి పెన్షన్స్ రాని వారందరికీ అన్ని రకాల పెన్షన్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామంలో దోమలు నివారణకు ఫాగింగ్ చేపట్టాలని , ప్రధానంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం నిధులు కేటాయించి గ్రామ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో మండల కమిటీ సభ్యులు కొండాపురం యాదగిరి, అబ్దుల్లాపురం వెంకటేష్ కొల్లూరి సిద్దిరాజు, లక్ష్మారెడ్డి, సురుపంగ ప్రకాష్ లు పాల్గొన్నారు.