జోరు అందుకున్న కారు ప్రచారం

నవతెలంగాణ- నిజాంసాగర్: మండల కేంద్రంలోని మూడో విడత ప్రచారంలో భాగంగా మల్లూర్,  వడ్డేపల్లి, మాగి, నిజాంసాగర్,సుల్తాన్ నగర్ లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి అయిన హనుమంత్ షిండే గారు మాట్లాడుతూ తన హయాంలో ఎంతో అభివృద్ధి చేశానని అన్నారు. రైతులందరికీ రైతుబంధు వర్తింప చేశానని అలాగే అకాల మరణంతో మరణించిన రైతులందరికీ ఐదు లక్షల రూపాయల రైతు బీమా అందించామని ఆయన అన్నారు. ఇన్ని రోజులు కేవలం పొలం పట్ట ఉన్నవాళ్లకే ఐదు లక్షలు అందజేశామని కానీ ఇప్పుడు ఏ ఒక్క సాధారణ మానవుడు మరణించిన ఐదు లక్షలు అధికారంలోకి రాగానే కేసీఆర్ భీమా ద్వార అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దానితోపాటు నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నిజాంసాగర్ మండలంలోని అన్ని గ్రామాలకు తాగునీరు తెచ్చి మీ రుణం తీర్చుకుంటానని అన్నారు. ప్రతి ఒక్క రైతు కూడా ఏడాదికి ఎలాంటి సాగునీటి సమస్య లేకుండా మూడుసార్లు పంటలు పండించుకోవచ్చని ఆయన అన్నారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడ బిడ్డా కు 3000 రూపాయులు అధికారం లోకి రాగానే సౌభాగ్య లక్ష్మి పథకం అమలు చేస్తాం అని ఆయన హామీ ఇచ్చాడు. అలాగే నేను లోకల్ మీ బిడ్డను కాంగ్రెస్ వాళ్లు అభ్యర్థిని సంగారెడ్డి నుండి తీసుకొచ్చారు. బీజేపీ వాళ్లు అభ్యర్థిని నిజామాబాద్ నుండి తీసుకొని వచ్చారు. నేను ఇక్కడే పుట్టాను చస్తే కట్టే కలేది కూడా ఇక్కడే నేను అన్ని వేళలో మీకూ అందుబాటులో ఉంటాను అని ఆయన అన్నాడు. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క గడపకి చేరాయని హనుమంతుని గుడి లేని గ్రామం లేదు కేసీఆర్ పథకాలు అందని ఇల్లు లేవని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని ఆయన కోరారు. మిగిలిన అభివృద్ధి పనులు ఏవైనా ఉంటే అధికారంలోకి రాగానే పూర్తిగా తీరుస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి ఒక్క గ్రామంలో హనుమంతు షిండే ను  ప్రజలు మంగళ హారతులతో బ్యాండ్ నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా జడ్పీ చైర్మన్ దపెధర్ రాజు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దుర్గా రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు రమేష్ గౌడ్, మండల యూత్ అధ్యక్షులు నాగరాజు,వైస్ ఎంపీపీ మనోహర్, బాబు సెట్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు కార్యకర్తలు భారీగా తరలివచ్చార్.
Spread the love