కారులో మంటలు ..తృటిలో తప్పిన పెను ప్రమాదం..

నవతెలంగాణ – డిచ్ పల్లి
నిర్మల్ జిల్లా నుండి హైదరాబాద్ కు వెళ్తున్న ఒక కారు ప్రమాద వశాత్తు పోగలు రావడం గమనించిన టోల్ ప్లాజా సిబ్బంది కారును తోచుకుంటు కొద్ది దూరం వరకు తీసుకుని వెళ్ళారు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం ఇందల్ వాయి మండల కేంద్రంలోని అత్హంగ్ టోల్ గేట్ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం నిర్మల్ జిల్లాకు చెందిన దీపక్ హైదరాబాద్ కు కారులో వెళ్తున్నారు. కారు టోల్ ప్లాజా వద్ద కు చేరుకోగానే ఇంజన్ నుండి పొగ రావడం టోల్ ప్లాజా సిబ్బంది గమనించారు.  టోల్ ప్లాజా ఇంచార్జీ ప్రవీణ్, లైన్ సూపర్ వైజర్ నరేష్, రమేష్ లు దీపక్ కు పొగ గురించి చెప్పి,  వేంటనే కారు నుండి కిందికి దిగమని చెప్పారు. దీంతో అప్రమత్తమైన దీపర్ వెంటనే బయటకు వచ్చేశాడు. మరికాసేపట్లో కారులోంచి పొగలు కాస్తా మంటలుగా మారి కారు మొత్తం వ్యాపిచేందడంతో సిబ్బంది కారును టోల్ ప్లాజా వద్ద నుండి కొద్ది దూరం వరకు లాగుతూ తీసుకెళ్ళారు. టోల్ ప్లాజాకు కొద్ది దూరంలో ఉన్న అగ్నిమాపక శకాటానికి సిబ్బంది  సమాచారం అందజేశారు. అప్పటికే మంటలు తీవ్రతరం అయ్యాయి. కాస్త ఏమరపాటు వహించి అలస్యం చేసిఉంటే పేను ప్రమాదం ముంచుకొచ్చిందని స్థానికులు, టోల్ ప్లాజా సిబ్బంది తెలిపారు. తృటిలో పేను ప్రమాదం నుండి తప్పించినందుకు దీపక్, స్థానికులు టోల్ ప్లాజా సిబ్బందిని అభినందించారు.
Spread the love