నవతెలంగాణ – చెన్నై
స్థానిక మద్రాసు హైకోర్టుపై డ్రోన్ ఎగిరిన వ్యవహారంలో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు సమీపంలోని ఎన్‌ఎస్సీ బోస్ రోడ్డు ఆవిన్ పార్లర్ సమీపంలో ఆదివారం కెమెరాతో కూడిన డ్రోన్ ఎగరడాన్ని గమనించిన హైకోర్టు భద్రతా పోలీసులు కంట్రోల్ రూంకు సమాచారం అందించారు. దీంతో ఎస్పిలనేడు పోలీసులు అక్కడకు చేరుకొని డ్రోన్ ఎగురవేసిన ట్రిప్లికేన్‌కు చెందిన విద్యాసాగర్, విఘ్నేశ్వరన్, కొరుక్కుపేటకు చెందిన సూర్యను అదుపులోకి తీసుకున్నారు. అయితే అనుమతి లేకుండా వారు డ్రోన్ కెమెరాతో ఫొటోలు తీసినట్లు విచారణలో తెలిసింది. ఈ తరుణంలో ముగ్గురిపై కేసు నమోదు చేసి పోలీసులు, స్టేషన్ బెయిలుతో వారిని విడుదల చేశారు.