నిరంతర కృషీవలుడు

      కామ్రేడ్ సుందరయ్య శత జయంతి సభలో పాల్గొనే అవకాశం నాకు కలగడం చాలా సంతోషం. ఆయన నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు, జీవి జీవితమంతా కచ్చితమైన క్రమశిక్షణను, కమ్యూనిస్టు విలువలను పాటించిన నాయకుడు. అసాధారణమైన త్యాగాలు చేసిన కొద్దిమందిలో ఆయనొకరు. మద్రాసులో ఆయన విద్యార్ధిగా ఉన్నప్పటి నుండి వామపక్ష రాజకీయాల పట్ట ఆకర్షితుడయ్యారు. సహజంగానే ఆనాటి పరిస్థితుల్లో జాతీయోద్యమంలో భాగస్వామి అయ్యారు. కాంగ్రెస్ సోషలిస్టు పార్టీని ఏర్పాటు చేయడంలో, దాని నుండి వామపక్ష భావాలుగల వారితో నిరంతర చర్చల ద్వారా వారికి మరింత స్పష్టత కల్పించడం ద్వారా రాష్ట్రంలో సోషలిస్టు భావాలకు విస్తృత ప్రచారం ప్రభావం కలిగించారు. కాంగ్రెస్ సోషలిస్టు ఫోరంకు కార్యదర్శిగా ఉన్నారు. ఆ రకంగా భవిష్యత్ కమ్యూనిస్టు పార్టీకి అవసరమైన భూమిక ఏర్పాటుచేశారు.
ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటైనప్పటి నుండి కామ్రేడ్ సుందరయ్యగారు ముఖ్యమైన పాత్ర నిర్వహించారు. మొదట్లో కార్మిక సంఘాలలో మునిసిపల్ పారిశుద్ధ్య పనివారు, ప్రెస్ కార్మికులు, హమాలీలు ఆ తర్వాత ట్రాన్స్పోర్టు రంగ కార్మికులు ఇలాంటి వారి సంఘాలే పునాదిగా ట్రేడ్ యూనియన్ ఏర్పడింది.
ఆంధ్ర రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం సామాజిక సంస్కరణలతో ముడిపడి వుంది. మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా, వర్ణాంతర సంస్కరణ వివాహాలకు కమ్యూనిస్టు పార్టీ కేంద్రమైంది. యువజన రంగం ద్వారా ఉద్యమం ప్రభావితమైంది. అనేక మంది కమ్యూనిస్టు యువకులు కట్నాలు లేని, కుల రహిత, వితంతు వివాహాలను చేసుకోవడం ద్వారా ఆదర్శంగా నిలబడ్డారు. రౌడీయిజానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ మిలిటెంట్ పోరాటం నడిచింది. మహిళల పట్ల గౌరవం వారికి పార్టీ బాధ్యతల్లో సమానమైన పాత్ర ఇవ్వటం ద్వారా వారిలో విశ్వాసం కలిగించి అనేక మంది కమ్యూనిస్టు నాయకులను తయారుచేశారు.
ఆంధ్రరాష్ట్రంలో మొదటి తరం కమ్యూనిస్టు జాతీయోద్యమాన్ని, కమ్యూనిస్టు ఉద్యమాన్ని సమ్మిళితం చేసి నిర్వహించారు. తద్వారా కమ్యూనిస్టు పార్టీ పలుకుబడి పరిధిని విస్తృతం చేశారు. రైతాంగంలో, వ్యవసాయ కార్మికులలో కమ్యూనిస్టు పార్టీ బలమైన శక్తిగా రూపొందింది. ఈ దశలో నిజాం రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ తరఫున పార్టీ తన అద్వితీయమైనది. కార్యకలాపాలు ప్రారంభించాలి వచ్చింది. కామ్రేడ్ సుందరయ్య, చంద్ర రాజేశ్వరరావు తదితర నాయకులు చర్చించుకొని, ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ తరపున ఈ కార్యక్రమం నిర్వహించారు. కామ్రేడ్ సీఆర్ను హైదరాబాద్ రెడ్డి హాస్టల్లో ఃసుబ్బారెడ్డిః అనే మారు పేరుతో చేర్పించి ఉద్యమానికి బీజం వేశారు.
అప్పటికే ఆంధ్ర మహాసభలో చురుకుగా వామపక్ష భావాలుగల యువకులను కమ్యూనిస్టు పార్టీలో చేర్పించారు. ఆంధ్ర ఃమహాసభ నాయకత్వ స్థానంలోనే కమ్యూనిస్టు పార్టీ వచ్చింది. కామ్రేడ్స్ రావి నారాయణరెడ్డి, అడ్డం ఎల్లారెడ్డి. దేవులపల్లి వెంకటేశ్వరరావు తదితర నాయకులు ప్రధాన పాత్ర వహించారు. కామ్రేడ్స్ అసోసియేషన్లో ఉన్న ముఖూం మొహియుద్దీన్, డాక్టర్ రాజ్ బహదూర్ గౌర్, మహమ్మద్ ఖాసిం తదితరులు కమ్యూనిస్టు పార్టీలోకి వచ్చారు. హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణా పోరాటం కడివెండిలో దొడ్డి కొమరయ్యను హత్య చేయడంతో కార్యరూపం తీసుకున్నది.. తెలంగాణా సాయుధ పోరాటంలో కామ్రేడ్ సుందరయ్య, రాజేశ్వరరావు తదితర నాయకుల పాత్ర అద్వితీయమైనది.
భారతదేశ స్వదేశీ సంస్థానాల్లో అతి పెద్దదైన నిజాం సంస్థానంలో వెట్టిచాకిరి, లక్షల ఎకరాల భూ కేంద్రీకరణ, పౌర హక్కులు లేని దుస్థితి. తెలంగాణా సాయుధ పోరాటంలో చారిత్రాత్మకమైన పాత్ర నిర్వహించింది. 3,500 మంది కమ్యూనిస్టు కార్యకర్తలు, నాయకులు ఈ పోరాటంలో అమరులయ్యారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు పోరాటాన్ని విస్తృత పరిచినపుడు, కామ్రేడ్స్ అసాధారణమైన త్యాగాలు చేశారు. అనేక మంది అమరులయ్యారు. భారత జాతీయోద్యమంలో తెలంగాణా పోరాటం చిరస్మరణీయం.
హైదరాబాద్ రాష్ట్రాన్ని యూనియన్ లో విలీనం భారత్ చేయడంలో సాయుధ పోరాటమే ప్రధాన పాత్ర వహించింది. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీని పటిష్టం చేయడంలో కామ్రేడ్ పిఎస్ గొప్ప పాత్ర నిర్వహించారు. సభలు, సమావేశాలలో ఆయన చేసిన ఉపన్యాసాలు విన్నాను. ఉమ్మడి పార్టీ చీలిక తర్వాత కొన్ని సందర్భాలలో ఆయనతో మాట్లాడే అవకాశం కలిగింది.
ఆయన ఎంత పెద్ద బాధ్యతలు నిర్వహించి జాతీయ స్థాయి నాయకుడైనా, సాధారణ పార్టీ సభ్యులు, కార్యకర్తలతో అత్యంత ఆప్యాయతతో మాట్లాడేవారు. కార్యకర్తల సమస్యలు తెలుసుకొని పరిష్కరించేవారు. ఆయన నిరాడంబరత నిబద్ధత, త్యాగం కమ్యూనిస్టు ఉద్యమంలోనే కాక, విశాల ప్రజా బాహుళ్యంలో, రాజకీయ ప్రత్యర్ధుల్లో కూడా ఆయనపట్ల అపారమైన గౌరవాన్ని సంపాదించి పెట్టింది.
ఆయన ఉపన్యాసాల్లోనూ, వ్యాసాల్లో లోతైన విశ్లేషణ కనిపిస్తుంది. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే ఆయన విశ్లేషించేవారని ప్రతీతి. భారతదేశ రాజకీయాల్లో గత 66 సంవత్సరాల కాలంలో అనేక మార్పులు సహజంగానే వస్తున్నా జాతీయోద్యమం సాధించాల్సిన అనేక లక్ష్యాలు పరిపూర్తి కాలేదు. స్వాతంత్య్రం తర్వాత దేశంలో అందరికీ అంగీకృతమైన అలీన విదేశాంగ విధానాన్ని పక్కకు పెట్టి ప్రస్తుత పాలకవర్గం అమెరికన్ సామ్రాజ్యవాదంతో బహిరంగంగా రఆజఈపడఉతఓందఇ. తద్వారా అలీన దేశాలకు ఆశాభంగం కలిగిస్తోంది.
దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో, కార్పొరేట్ అనుకూల వ్యవస్థగా మార్పుతో దేశంలో మెజారిటీ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా నేటి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ధరలు పెరుగుదల, నిరుద్యోగం, దారిద్ర్యం, ప్రజలపై అసాధారణ భారాలు మోపుతున్నాయి. ప్రజలలో అసంతృప్తి ఆగ్రహం పెరుగుతున్నాయి. ప్రజాందోళనలు, ఉద్యమాలు పెంచాల్సిందే. వామపక్ష కార్యకర్తలపై , పార్టీలపై దాడులు తీవ్రమవుతున్నాయి. కార్పొరేట్ మీడియా ప్రభుత్వ అనుకూల మీడియాగా మారిపోయి ప్రజలను ప్రభావితం చేస్తుంది. ఈ తరుణంలో రాజకీయ ప్రత్యామ్నాయం వామపక్షాల నేతృత్వంలో అవసరమవుతుంది. రాజకీయ విలువలను పునరుద్ధరించాలని. ఆకలి, కడగండ్లు, దోపిడీల గాని సోషలిస్టు వ్యవస్థను భారతదేశంలో సాధించేందుకు పునరంకితం కావడమే కామ్రేడ్ సుందరయ్యకు మనవివ్వగల నివాళి.

– సురవరం సుధాకర్ రెడ్డి
సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి

Spread the love