విద్యారంగానికి నిరాశపర్చిన రాష్ట్ర బడ్జెట్

A disappointing state budget for education– సూర్యాపేట జిల్లా కేంద్రంలో పిడిఎస్యు నిరసన
– విద్యారంగ అభివృద్ధి కోసం బడ్జెట్ సవరించి నిధులు పెంచాలి
– నామాల ఆజాద్ పిడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
తెలంగాణ రాష్ట్ర విద్యారంగ అభివృద్ధి కోసం కేంద్రీకరిస్తామని మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేడు కేవలం 7.3 శాతం నిధులు మాత్రమే కేటాయించడంంచడం  ఎంతవరకు సమంజసమని పిడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామల ఆజాద్, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ లు విమర్శించారు. గురువారం స్థానిక సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అరవై ఫీట్ల రోడ్ లో రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడంను నిరసిస్తూ పిడిఎస్యు అధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విద్యారంగం పైన కేంద్రీకరిస్తామని మాటలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆచారాణత్మక బడ్జెట్ కేటాయింపులు చేయకపోవడం శోచనీయం అన్నారు. కేవలం రూ.21389 కోట్లు కేటాయించి  మాటల ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్ ద్వారా తేలిపోయిందన్నారు. ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీల అమలు గురించి ఈ బడ్జెట్లో ప్రస్తావనే చేయకపోవడం దుర్మార్గం అన్నారు. సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాలు, గురుకులాలకు సొంత భవనాలు, వాటి అభివృద్ధి పైన స్పష్టమైన వైఖరి వెల్లడించకపోవడం వెనక ఉన్న అంతర్యం ఏమిటనీ ప్రశ్నించారు. విద్యార్థులకు గత ప్రభుత్వం పెంచిన మెస్ చార్జీల అమలుపై ప్రస్తావన లేదన్నారు.స్కాలర్షిప్,ఫీజు రియాంబర్స్ మెంట్  బకాయిలు ప్రతి ఏడాది పెండింగ్ లేకుండా విడుదల చేస్తామని చెప్పలేదు. పైగా పెండింగ్ నిధులు విడుదల పైన ఊసే లేదన్నారు. యూనివర్సిటీ అభివృద్ధి పైన సమగ్రమైన ప్రణాళిక రూపొందించలేదు కేవలం రూ.500 కోట్లు కేటాయించి  మౌలిక వస్తువులకు మాత్రమే పరిమితం అవడం ఎంతవరకు సమంజసం అన్నారు.తక్షణమే బడ్జెట్ ను సవరించి విద్యారంగానికి నిధులు పెంచడం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనియెడల పిడిఎస్యు ఆధ్వర్యంలో ఉద్యమాలకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు విజయ్ రెడ్డి, తరుణ్, అరుణ్, ప్రసాద్, లక్ష్మణ్, ఆంజనేయులు, రాము తదితరులు పాల్గొన్నారు.
Spread the love