పంట తరలించే అవకాశం లేక..చెరుకు పంటకు నిప్పు పెట్టిన రైతు
మెదక్ – కౌడిపల్లి మండలం సదాశివపల్లికి చెందిన కృష్ణ గౌడ్ అనే రైతు తన చెరుకు పంటకు నిప్పు పెట్టారు. తన పొలంకు వెళ్లేందుకు దారి లేకపోవడంతో చెరువు కట్ట పైనుండి దారి ఏర్పాటు చేసుకోగా కొందరు దానిని అడ్డుకున్నారు.
పంట తరలించే… pic.twitter.com/9PlhzERGvM
— Telugu Scribe (@TeluguScribe) March 3, 2024
నవతెలంగాణ – హైదరాబాద్: సాధారణంగా రైతులు పంట పండించాలంటే చాలా శ్రమ దార పోయాలి. రైతు పంట పండించడం ఒక ఎత్తు అయితే పండించిన పంటను చేర్చడం మరొ ఎత్తు అయింది ఇప్పుడు. ఎండనక, వాననక ఆరు గాలం కష్ట పడి రైతు పంట పండిస్తే.. ఆ రైతుకి చివరికీ కన్నీరే మిగిలింది. అలాంటి రైతులు కొందరూ ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. మరికొందరూ పండించిన పంటను తగుల బెడుతున్నారు. మొత్తానికి నష్టపోయేది మాత్రం రైతునే. తాజాగా ఓ సంఘటన చోటు చేసుకుంది. పంట తరలించే అవకాశం లేక..చెరుకు పంటకు నిప్పు పెట్టిన రైతు మెదక్ – కౌడిపల్లి మండలం సదాశివపల్లికి చెందిన కృష్ణ గౌడ్ అనే రైతు. తన చెరుకు పంటకు నిప్పు పెట్టారు. తన పొలంకు వెళ్లేందుకు దారి లేకపోవడంతో చెరువు కట్ట పైనుండి దారి ఏర్పాటు చేసుకోగా కొందరు దానిని అడ్డుకున్నారు. పంట తరలించే అవకాశం లేనందున అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోకపోవడంతో చెరుకు పంటకు నిప్పు పెట్టి నిరసన తెలిపాడు.