గ్యాస్ లీక్.. తప్పిన పెనుప్రమాదం

నవతెలంగాణ – పెద్దవంగర
మండలంలోని చిన్నవంగర గ్రామంలో గ్యాస్ లీకై పెను ప్రమాదం తప్పింది. గ్రామానికి చెందిన యాసారపు యాదమ్మ శుక్రవారం ఉదయం రోజు మాదిరిగానే వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్‌ లీకై మంటలు చెలరేగాయి. వెంటనే చుట్టు పక్కల వారు అప్రమత్తం కావటంతో ప్రమాదం తప్పింది. సుమారు లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. ఇంటి పై కప్పు, ఫర్నిచర్, విలువైన పత్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని బాధితురాలు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలు కోరారు.
Spread the love