ఘనంగా వైద్య, ఆరోగ్య సంబరాలు..

నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ ప్రభుత్వం వైద్య, ఆరోగ్యం పైనే ప్రధాన దష్టిసారించిందని,ప్రధానంగా గిరిజన ప్రాంతాలలో కోట్లు రూపాయిలు వెచ్చించి అడవి బిడ్డలకు వైద్యం అందించడం జరుగుతున్నదని,ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం సక్రమమైన సమర్ధవంతమైన పాలనను అందిస్తున్నది. అని స్థానిక శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో గల సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక అధికారి,డీఆర్డీఏ పి.డి మధుసూధన్ రాజు అద్యక్షతన,డీ.సీ.హెచ్.ఎస్ డాక్టర్ రవిబాబు పర్యవేక్షణలో వైద్య,ఆరోగ్య దినోత్సవం సంభరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ముఖ్యతిధులుగా హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే, కలెక్టర్ లను లంబాడీ సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు.మంచి మనస్సుతో ఈ సారి కూడా కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని ఆశీర్వదించాలని కోరారు. మంచి వాతావరణంలో వైద్య, ఆరోగ్య దినోత్సవం ను జరుపుకున్నామని ప్రగతిని చేసిన పనిని ప్రజలకు తెలుపుకునేందుకు ఒక అవకాశం కల్పించేందుకు ఈ వేదిక అని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ లబ్దిచేకూర్చిందని అందుకు లబ్దిదారులే సాక్షి అన్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ దావకానాలో వైద్యం అందుతుందని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో ప్రగతి సాదించిందని రాష్ట్రంలో 8 మెడికల్ కళాశాలలు మంజూరు కాగా భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఒక్కటి ఏర్పాటు చేయటం జరిగిందని అనుకున్నదే తడవుగా కళాశాలను మొదటి ఏడాది 155 సీట్లుతో కళాశాల ప్రారంభమైందన్నారు. జిల్లాలో ఐదు లక్షల మందికి కంటి పరీక్షలను నాలుగు నెలలో నిర్వహించటం ప్రాణంపోసే మంచి మనస్సుతో ఈ సారి కూడా కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని ఆశీర్వదించాలని కోరారు. వాతావరణంలో వైద్య,ఆరోగ్య దినోత్సవంను జరుపుకున్నామని ప్రగతిని చేసిన పనిని ప్రజలకు తెలుపుకునేందుకు ఒక అవకాశం కల్పించేందుకు ఈ వేదిక అని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ లబ్ది చేకూర్చిందని అందుకు లబ్ది దారులే సాక్షం అన్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ దావకానాలో అనంతరం జిల్లా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ..  సరిహద్దుల్లో సైనికుల్లా ప్రాణాలను ప్రణంగా పెట్టి కాపాడిన ఘనత ఆశ,ఎన్ఎం, వైద్యులదేనని కొనియాడారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అందిస్తూ ఆరోగ్య, రైతు శిభిరాలను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.ప్రజలు ఆరోగ్య పరంగా ఎటువంటి ఇబ్బందులు పడకూడదనే డబ్బుకు లెక్కచేయక 24 గంటలు సామాన్య ప్రజలకు వైద్యం అందుబాటులో ఉంచిన ఘనత సీఎం దేనని ఆనందం వ్యక్తం చేశారు.చల్లని చేతులతో జిల్లాలో 12 లక్షల మంది ఉంటే 10 లక్షల మందికి రెండు డోసులు అందించిన ఘనత వైద్య సిబ్బందిదని అభినందించారు.త్వరలోనే అశ్వారావుపేటలో బ్లడ్ బ్యాంక్ సేవలు అందుబాటులోకి రానున్నాయని వివరించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన వైద్య సిబ్బందికి, డాక్టర్లు, ఇతర సిబ్బందికి సత్కరించి ప్రశంసా పత్రాలను ఎమ్మెల్యే,కలెక్టర్ చేతులమీదుగా అందజేశారు. ఈ సభానంతరం డీసీహెచ్ఎస్ రవిబాబు ఆశ, ఎన్ఎం, వైద్య సిబ్బందితో కలసి ఆటా పాట అందించి సందడి చేసిన తీరు చూపరులను ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో ఎంపీపీలు జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, ఎంపీపీ సోయం ప్రసాద్, సున్నం లలిత, బానోతు పార్వతి, ఎం నాగమణి, జెడ్పీటీసీలు చిన్నంశెట్టి వరలక్ష్మీ, పైడి వెంకటేశ్వరావు, బి లావణ్య, అశ్వారావుపేట, దమ్మపేట వైస్ ఎంపీపీలు చిట్టూరి ఫణీంద్ర, దారా మల్లిఖార్జునరావు, పేరాయగూడెం సర్పంచ్ నార్లపాటి సుమతి, పోగ్రామం పర్యవేక్షకులు డిఆర్డీఏ పీడి మధుసుధనరాజు, డి అన్నపూర్ణ, జి. పంపిణీ కాక్రమం జరగగా మనజిల్లా పూర్తిస్థాయిలో విజయవంతం కావటం సంతోషకరమన్నారు. జిల్లాలో ఖైదు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయటం జరిగిందని నగర వాసులకు సైతం ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. లాక్డౌన్ సమయంలో వైద్య సిబ్బంది కరోనాతో వీరోచితంగా పోరాడి ప్రజలను కాపాడారని ప్రశంసించారు. కోవిడ్ మహామ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వం అందించిన వ్యాక్సిన్  జరిగిందని 8 జిల్లాల్లో ఫైలెట్ ప్రాజెక్టుగా న్యూటిషన్ కిట్లు రేవతి, సిహెచ్ నాగేశ్వరావు, బి శ్రీను తాసీల్దార్లు లూధర్ విల్సన్, బద్రకాళి, రవికుమార్, స్వామి, శేషగిరి,సిఐ బాలకృష్ణ, సిడిపిఓ రోజారాణి, బ్రిఆర్ఎస్ నాయకులు అశ్వారావుపేట మండలపార్టీ అధ్యక్షులు బండి పుల్లారావు, దమ్మపేట దొడ్డాకుల రాజేశ్వరావు, సీఐ బాలకృష్ణ, యూఎస్ ప్రకాష్, మందపాటి రాజమోహన్రెడ్డి, సంపూర్ణ, రవితో పాటు ఐదు మండలాల ఐసిడిఎస్, సెర్చ్, పంచాయతీ సిబ్బంది ఐదు మండలాల వైద్య సిబ్బంది, అంగన్వాడి సిబ్బంది.

Spread the love