వర్షానికి కూలిన 200 ఏండ్లనాటి భారీ వృక్షం

వర్షానికి కూలిన 200 ఏండ్లనాటి భారీ వృక్షంనవతెలంగాణ- విలేకరులు
హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వర్షాలు పడుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని జీహెచ్‌ఎంసీ సూచించింది. వర్షం, ఈదురుగాలుల ధాటికి చాలా ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. వాహనదారులు ట్రాఫిక్‌తో ఇబ్బందులు పడ్డారు. టోలిచౌకీ-గోల్కొండ ఎండీ లైన్స్‌లో 200 ఏండ్ల నాటి భారీ వృక్షం కూలింది. ఈ ఘటనలో ఒక వ్యక్తికి గాయాలు కాగా.. నాలుగు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. గచ్చిబౌలి, మాదాపూర్‌, రాయదుర్గం, షేక్‌పేట, ఖైరతాబాద్‌, పంజాగుట్ల, లక్డీకపూల్‌, అమీర్‌పేట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, దిల్‌ సుఖ్‌ నగర్‌, మలక్‌ పేట,ఉప్పల్‌, కాప్రా, మేడ్చల్‌ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. ఈ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అలాగే పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సమస్య నెలకొంది.

Spread the love