కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం..

నవతెలంగాణ – హైదరాబాద్: పశ్చిమబెంగాల్‌ కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జెస్సోర్‌ రోడ్డులోని స్లమ్‌ ఏరియాలో శనివారం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో చాలా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో జెస్సోర్‌ ప్రాంతాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మంటలు ఆర్పివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love