నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామబాద్ నగరంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి భారీ వర్షం నేలకొరిగింది. దీంతో ఆ చెట్టు కింద నిలిపి ఉంచిన మూడు వాహనాలు ధ్వంసం అయ్యాయి. హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన శ్రీనివాస్ కారు పూర్తిగా ధ్వంసం అయింది. మరో రెండు వాహనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.