ప్రజలకు ప్రభుత్వానికి వారధి జర్నలిస్టు

నవతెలంగాణ-ధర్మసాగర్
కెమెరా అన్నది ప్రజలకు ప్రభుత్వానికి వారిది జర్నలిస్టుల పాత్ర ఎంతో గొప్పదని టీయుడబ్ల్యూజేఫ్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు టివి రాజ్ అన్నారు. మండల కేంద్రంలో ప్రింట్ మీడియా అసోసియేషన్ ధర్మసాగర్ మీడియా పాయింట్ ప్రారంభోత్సవం ఆ మీడియా పాయింట్ అధ్యక్షులు పోలుమారి గోపాల్ అధ్యక్షతన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి టీయుడబ్ల్యూజేఫ్  హన్మకొండ జిల్లా కార్యదర్శి, కాజీపేట మీడియా పాయింట్ అధ్యక్షులు సీనియర్ సాక్షి పత్రిక రిపోర్టర్ బత్తిని రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విలేకరి వృత్తి కత్తిమీది సాము లాంటిదని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా వ్యవహరించడంలో వారు ఎలాంటి ప్రలోభాలకు లంగకుండా పత్రికల్లో ప్రచురించడం వల్ల ప్రభుత్వానికి ఇటు ప్రజలకు చాలా సందర్భాలలో ఎన్నో కష్టాలను నష్టాలను అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. ఒకరికి న్యాయం చేస్తే మరోకరికి పరోక్షంగా శత్రువులుగా మరి వ్యతిరేక దిశలో పని చేసినారు అనే సందర్భంలో అనేక విలేకరులు తమ ప్రాణాలను సహితం కోల్పోయిన సందర్భాలు కో కుళ్ళలుగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వృత్తిలో కొనసాగుతున్న సహచర విలేకరులు కొన్ని సందర్భాలలో పోలీసులకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు సహితం నిజాన్ని నిర్భయంగా చెప్పినారనే సందర్భాలలో వారి నుండి అనేక దాడులను ఎదుర్కొన్న సంబంధాలు చెప్పకనే చెప్పవచ్చని తెలిపారు.
ఈ సందర్భంగా నేడు అనేక మీడియా పత్రికలు, వెబ్ న్యూస్ ఛానల్, సోషల్ మీడియా అనేక వాస్తవాలను ప్రచురించినప్పటికీ కొందరి ప్రలోభాలకు తలోగి అనేక మంది జర్నలిస్టులను హింసించిన సంఘటనలు చాలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు అనేకంగా జరుగుతుండడంతో ప్రభుత్వం దానికి అనుగుణంగా విలేకరుల కోసం ప్రత్యేక విధమైన నిబంధనలు, సందేశాలను ఇవ్వాల్సిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇలాంటి జర్నలిస్టులపై జరుగుతున్నటువంటి దాడులను ప్రభుత్వము వెంటనే స్పందించి తగిన చర్యలను చేపట్టాలని ఈ సందర్భంగా వారు కోరారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండే జర్నలిస్టుల సమస్యలను సహితము ప్రభుత్వము గుర్తించి వారికి కావలసిన అన్ని ఆర్థిక పరమైన సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వము కృషి చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.
అనంతరం మీడియా పాంయిట్ కు విచ్చేసిన అతిధులకు ప్రజా ప్రతినిధులకు అధికారులకు మీడియా పాయింట్ బాధ్యులు ప్రతి ఒక్కరిని శాలువాలతో సత్కరించి అభినందించారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పిట్టల శ్రీలత,కాజిపేట్ మండల మనం రిపోర్టర్ సాంబయ్య, ఎంపీటీసీలు సర్పంచి కురుసపల్లి నవ్య ప్రవీణ్,బొడ్డు శోభ సోమయ్య, రోండీ రాజు యాదవ్, కొలిపాక వనమాల, సీఐ శ్రీధర్ రావు, గ్రామ పుర ప్రముఖులు బొడ్డు ప్రభుదాస్, మాజీ జెడ్పిటిసి బోర్డు వాసుదేవ్, ఏలుకుర్తి సర్పంచ్ మాదాసి అరుణ యాదగిరి,ఏలుకుర్తి గ్రామ శాఖ అధ్యక్షులు బేర మధుకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుర్రపు ప్రసాద్, మహిళ మండలి అధ్యక్షురాలు ముట్టే యామిని, మాజీ ఎంపీటీసీ అంకం రాజమణి, మాజీ ఎంపీటీసీ మాజీ ఉప సర్పంచ్ రావుల వెంకటరెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ బొడ్డు లెనిన్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love