- Advertisement -
నవతెలంగాణకు 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేర్చడంతో పాటు, ప్రజల కష్టాలు, ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి కృషి చేయడంలో నవతెలంగాణ దిన పత్రిక చేస్తున్న కృషి అభినందనీయం. ఆ పత్రికకు 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ‘నవతెలంగాణ’ మరింతగా అభివృద్ధి చెంది తెలంగాణ ప్రజల ఆదరణను చూరగొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఆ పత్రిక యాజమాన్యానికి, సిబ్బందికి, పాఠకులు, జర్నలిస్టులకు శుభాకాంక్షలు.
- Advertisement -



