వృద్ధాప్యంలో ఏ పని చేతకాక పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

– కేసు నమోదు చేసిన దుబ్బాక పోలీసులు 
నవతెలంగాణ-దుబ్బాక రూరల్ 
వృద్ధాప్యంలో ఏ పని చేతకాక వ్యక్తి పురుగుల మందు తాగి మృతి చెందాడు.ఈ సంఘటన దుబ్బాక మున్సిపాల్టీ పరిధిలోని చెల్లాపూర్ వార్డ్ లో చోటు చేసుకుంది. మంగళవారం దుబ్బాక ఎస్ఐ గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం చెల్లాపూర్ వార్డ్ కి చెందిన కంతి గంగయ్య (80) వృత్తి రీత్యా కూలీ పనులు చేస్తూ కుటుంబంతో జీవనం సాగిస్తున్నారు. వృద్ధాప్య వయసులో ఉండి ఏపని చేతకాక , డబ్బులు లేక బాధపడుతూ బ్రతకడం కంటే చావే శరణ్యం అని భావించి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లి సోమవారం ఉదయం 10 గంటలకు గ్రామ శివారులోని నీలగిరి తోటలో గుర్తు తెలియని పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో వెళ్ళాడు. ఈ విషయం గుండెల్లి బాబు గుర్తించి గంగయ్య కుమారుడికి ఫోన్లో తెలపడంతో వెంటనే 108లో దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ఏరియా ఆస్పత్రిలో చేర్పించగా  చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారు పర్శారాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
Spread the love