ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డికి తప్పిన ప్రమాదం

– బైక్‌ను తప్పించబోయి చెట్టుకు ఢకొీట్టిన కారుత
నవతెలంగాణ – శంకరపట్నం
ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలంలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. సోమవారం హుజురాబాద్‌లో 2కే రన్‌కు హాజరయ్యేందుకు కరీంనగర్‌ నుంచి బయలుదేరారు. శంకరపట్నం మండలం తాడికల్‌ గ్రామ సమీపంలో బైకును తప్పించబోయి కారు చెట్టును ఢకొీని పొలాల్లోకి దూసుకెళ్లింది. వెంటనే ఎయిర్‌ బెలూన్లు ఓపెన్‌ కావడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం ఆయన మరో కారులో హుజురాబాద్‌ వెళ్లి ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించుకుని 2కే రన్‌లో పాల్గొన్నారు. బైక్‌పై ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా, వెంటనే 108లో ఆస్పత్రికి తరలించారు.

Spread the love