5 వ పోలీస్ స్టేషన్లో అదృశ్య కేసు నమోదు

నవ తెలంగాణ కంఠేశ్వర్
నిజామాబాద్ నగరంలోని 5వ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అదృశ కేసు నమోదు అయినట్లు ఐదవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సాయినాథ్ బుధవారం తెలిపారు. ఎస్సై సాయినాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నాగారం నివాసి అయిన పురం శెట్టి నిఖిల్ వయసు29  సంవత్సరాలు అప్పుల విషయంలో తన బార్యతో ఇంట్లో గొడవపడి,  అప్పుల బాధ బరించలేక, తేది: 22.05.2023 నాడు రాత్రి సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయాడని తెలియజేశారు. ఇట్టి విషయంపైన అతని తండ్రి పురం శెట్టి గణేష్ ఐదవ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసును అదృశ్య కేసు కింద నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఐదవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సాయినాథ్ తెలియజేశారు. తప్పిపోయిన వ్యక్తి వివరములు ఈ విధంగా ఉన్నాయి.పురం శెట్టి నిఖిల్ తండ్రి పేరు: పురంశెట్టి గణేష్, వయసు: 29  సంవత్సరాలు, వృత్తి: సేల్స్ మెన్, (దీబాషి కంపెనీ), నివాసం: 80 క్వార్టర్స్, నాగారం, నిజామాబాదు చెందినవారు అని తెలియజేశారు.

Spread the love