కప్పు వేటకు నయా జెర్సీ

– టీ20 వరల్డ్‌కప్‌ భారత జెర్సీ ఆవిష్కరణ
ముంబయి : 2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ వేటలో భారత జట్టు ధరించే జెర్సీని కిట్‌ స్పాన్పర్‌ ఆడిడాస్‌ సోమవారం ఆవిష్కరించింది. సంప్రదాయ బ్లూ, ఆరెంజ్‌ రంగులో ఉన్న జెర్సీకి ఆడిడాస్‌ త్రీ స్ట్రిప్స్‌ తెలుగు రంగులో ఉన్నాయి. కాలర్‌కు మువ్వెన్నల జెండా రంగులను ఉంచారు. కొత్త జెర్సీపై అభిమానులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. 2019 వరల్డ్‌కప్‌లో భారత జట్టు ధరించిన జెర్సీనే అటుఇటుగా మార్చి కొత్తగా విడుదల చేశారని విమర్శిస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌ కరీబియన్‌, యుఎస్‌ వేదికగా జూన్‌ 2 నుంచి ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.

Spread the love