ఇవ్వాళో..రేపో జైలుకు కవిత

– లిక్కర్‌ స్కామ్‌, అవినీతిలో కేసీఆర్‌ సర్కారు
– కేంద్ర మంత్రి అశ్విన్‌ కుమార్‌ చౌబే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
లిక్కర్‌ స్కామ్‌లో, అవినీతిలో కేసీఆర్‌ సర్కారు కూరుకుపోయిందనీ, ఆయన కూతురు కవిత ఇవ్వాళో..రేపో జైలుకెళ్లడం ఖాయమని కేంద్ర మంత్రి అశ్విన్‌ కుమార్‌ చౌబే చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్‌, కేసీఆర్‌ ఇద్దరూ కలిసి ప్రజల్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. బీసీ సీఎం చేస్తామని ప్రధాని హామీనిచ్చారనీ, బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. గోవా ఎన్నికల్లో కేజ్రీవాల్‌ రూ.100 కోట్ల అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణలో మిషన్‌ భగీరథ పథకంలో పెద్ద కమీషన్లు తీసుకున్నారని విమర్శించారు.

Spread the love