చెట్టుకు ఢీకొన్న ప్రయివేటు బస్సు… ఒకరి పరిస్థితి విషమం

నవతెలంగాణ – చిట్యాల టౌన్

చిట్యాల సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ప్రయివేటు బస్సు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఇరువురికి తీవ్ర గాయాలు కాగా వారిలో డ్రైవర్ కు కాలు విరిగింది. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. హైదరాబాదు నుండి గుంటూరు వెళుతున్న ఈ బస్సులో ప్రమాద సమయంలో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. చిట్యాల ఎస్సై రవి సమాచారం తెలిసిన వెనువెంటనే సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని ప్రయాణికులను రక్షించే చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కామినేని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Spread the love