Friday, April 24, 2026
E-PAPER
Homeబీజినెస్బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీగా ప్రయివేటు వ్యక్తి..!

బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీగా ప్రయివేటు వ్యక్తి..!

- Advertisement -

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ పగ్గాలను ప్రయివేటు వ్యక్తులకు అప్పగించడానికి కేంద్రం కసరత్తు చేస్తోందని సమాచారం. గతేడాది జులైలో పీకే పుర్వార్‌ పదవీ విరమణ తర్వాత సంస్థకు పూర్తిస్థాయి సీఎండీ లేకపోవడం, అంతర్గత అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో జాప్యం జరుగుతుండటంతో ప్రభుత్వం ఈ ప్రత్యామ్నా యాన్ని పరిశీలిస్తోందని రిపోర్టులు వస్తోన్నాయి. ప్రస్తుతం సంస్థలోని కొందరు ఉన్నతాధికారులపై విచారణలు కొనసాగుతుండటం కూడా అంతర్గత నియామకాలకు ఆటంకంగా మారింది. ఈ నేపథ్యంలో ఒక అనుభవజ్ఞుడైన ప్రయివేటు నిపుణుడిని నియమించడం ద్వారా సంస్థలో జవాబుదారీతనం పెంచి, తిరిగి లాభాల బాట పట్టించాలని ప్రభుత్వం భావనగా ఉందని సమాచారం. అయితే.. సీఎండీ వంటి కీలక ప్రభుత్వ సంస్థల్లో ప్రయివేటు వ్యక్తుల సంస్కృతి ప్రవేశించడం వల్ల దీర్ఘకాలంలో ఉద్యోగ భద్రతపై ప్రభావం పడే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అలాగే సామాన్యులకు అందించే చౌకైన టెలికాం సేవలు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాధాన్యతలు తగ్గే ప్రమాదం ఉంది. ప్రయివేటు వ్యక్తుల నియామకం ద్వారా సంస్థలో ఉన్న ప్రతిభావంతులైన ప్రభుత్వ అధికారుల కెరీర్‌ వృద్ధికి ఆటంకం కలగడమే కాకుండా, దేశీయ టెలికాం రంగంలో ప్రభుత్వ ఆధిపత్యం క్రమంగా ప్రయివేటు శక్తుల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని ఆ వర్గాల్లో ఆందోళన నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -