ఏజెన్సీలోని ఆదివాసి యువకులకు అరుదైన గౌరవం

– వేస్టేజ్ లో ఉత్తమ వ్యాపారం.. విదేశాలలో పర్యటన
నవతెలంగాణ -తాడ్వాయి
మండలంలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన బంధాల గ్రామపంచాయతీ లోని నర్సాపూర్ (పిఎల్) గ్రామానికి చెందిన మంకిడి సుధాకర్, మంకిడి ఎర్రయ్య అనే ఇద్దరు యువకుల వేస్టేజ్ అనే వ్యాపారం లో ఉత్తమంగా వ్యాపారం, మంచి బిజినెస్ చేసినందుకు శనివారం థాయిలాండ్ దేశంలోని బ్యాంకాక్ విదేశాలకు ఫ్లైట్(విమానం) ద్వారా వెళ్లే అరుదైన గౌరవం లభించింది. వారు ఈరోజు శనివారం సెప్టెంబర్ 30 వ తారీఖున బెంగళూరు వెళ్లి అక్కడి నుండి ఫ్లైట్ (విమానం)లో థాయిలాండ్ దేశం లోని బ్యాంకాక్ నగరానికి చేరుకున్నారు. వీరికి అన్ని ఖర్చులు వేస్టేజ్ కంపెనీ భరిస్తుంది. ఎక్కడో మార్మూల ఏజెన్సీలో, దట్టమైన అడవిలో ఉండే ఆదివాసీలు ఫ్లైట్ ద్వారా విదేశాలకు వెళ్లి అవకాశం కలిగినందుకు, వివిధ ఆదివాసి సంఘాల నాయకులు, వివిధ గ్రామాల ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ అవకాశం కల్పించిన వేస్టేజ్ కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు.
Spread the love