– మంత్రి తుమ్మల
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పామాయిల్ విస్తరణవకాశాలు, ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వహణ, సాగులో అనుసరిస్తున్న సాంకేతిక విధానాలు, ఆయిల్ పామ్ ఉత్పాదకాలు తదితరాంశాలను పరిశీలించేందుకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, డైరెక్టర్, ఉద్యానశాఖ ఎండీ ఆయిల్‌ఫెడ్ యాస్మిన్ బాషా బందం మలేషియా పర్యటనలో పర్యటిస్తున్నారు. మలేషియా ప్లాంటేషన్, కమోడిటీస్ మంత్రి జోహరి అబ్దుల్ ఘనీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు కోసం అందిస్తున్న ప్రోత్సహకాలు, ప్రస్తుత పరిస్థితి, రానున్న రోజుల్లో ఆయిల్ పామ్ పరిశ్రమ అభివృద్ధికి గల అవకాశాలు వివరించారు. మలేషియా పామ్ ఆయిల్ బోర్డును సందర్శించి, పామ్ ఆయిల్ రంగంలో వాళ్ళ అనుభవాలను ఎంపీవోబీ చైర్మెన్ డా. అహ్మద్ పర్వేజ్ గులామ్ ఖాదీర్ పంచుకున్నారు. ఆయిల్ పామ్ సాగులో ఒక నూతన ఒరవడిని సృష్టించిందని తెలిపారు. ఆయిల్ పామ్ సాగుకు ముందుకు వచ్చే ప్రాంతాలలో పంట విస్తరణకు కావాల్సిన సాంకేతిక సహాయం అందిస్తుందని తెలియజేశారు.