Monday, April 27, 2026
E-PAPER
Homeసినిమాఅందరికీ కనెక్ట్‌ అయ్యే కథ..

అందరికీ కనెక్ట్‌ అయ్యే కథ..

- Advertisement -

తరుణ్‌ భాస్కర్‌ న్యూ-ఏజ్‌ ఎంటర్‌టైనర్‌ ‘గాయపడ సింహం’తో అలరించబోతున్నారు. కశ్యప్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రం మే 1న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
పవన్‌ సాదినేని సమర్పణలో ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్‌, పీఓవీ స్టోరీస్‌, జీ స్టూడియోస్‌ బ్యానర్ల పై కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్‌ ప్రతాప, విజరు కష్ణ లింగమనేని, ఉమేష్‌ బన్సల్‌ నిర్మించారు.
తాజాగా హీరో దుల్కర్‌ సల్మాన్‌ ఈ చిత్ర ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,”గాయపడ్డ సింహం’ టైటిల్‌ విన్నప్పటినుంచే నాకు చాలా క్యూరియాసిటీ కలిగింది. ‘ఆకాశంలో ఒక తార’ సినిమా చేస్తున్నప్పుడు పవన్‌ ఈ సినిమా గురించి ప్రతిదీ చెప్తుండేవారు. ఇందులో నటిస్తున్న అందరూ నా మంచి ఫ్రెండ్స్‌. ట్రైలర్‌ మైండ్‌ బ్లోయింగ్‌గా ఉంది. ప్రతి విజువల్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇది తప్పకుండా బిగ్‌ సమ్మర్‌ బ్లాక్‌బస్టర్‌ అవుతుందని నమ్మకం ఉంది. ఈ సబ్జెక్ట్‌ అందరికీ రిలేటబుల్‌గా ఉంటుంది. మనలో చాలామంది ఎప్పుడో ఒకసారి అమెరికా వెళ్లాలని కల కంటారు. కాబట్టి ఆడియన్స్‌ ఖచ్చితంగా కనెక్ట్‌ అవుతారు. కశ్యప్‌ చక్కగా డైరెక్ట్‌ చేయడంతో పాటు మంచి క్యారెక్టర్‌ చేశారు. జెడి సినిమాలు చిన్నప్పటి నుంచి చుస్తున్నాను. ఆయన వర్క్‌ అంటే నాకు ఇష్టం. పవన్‌తో చేస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ నాకు చాలా స్పెషల్‌ ఫిల్మ్‌. పవన్‌ కూడా మల్టీ టాస్కర్‌. ఈ సినిమాను ఆయన ప్రజెంట్‌ చేస్తున్నారు. మంచి సినిమాను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. గ్రేట్‌ కంటెంట్‌తో వస్తోంది. తప్పకుండా అందరూ థియేటర్‌లో ఎంజారు చేసేలా ఉంటుంది’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -