దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సైకాలజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్’.
ఈ చిత్రాన్ని మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తున్నారు. ఏంఎస్ వ¶వీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా జూన్ 5న థియేటర్లలోకి రానుందని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు.
అకడమిక్ సీజన్ ప్రారంభానికి ముందు ఈ రిలీజ్ ప్లాన్ చేయడం మంచి స్ట్రాటజిక్‌గా కనిపిస్తోంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో సత్యదేవ్ రాయల్ అవతార్‌లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో, అధికారం, రహస్యభావం కలిసిన లుక్‌తో ఆయన ప్రెజెన్స్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఆయన పాగాలో కనిపించే చిన్న పురుగు ఒక సింబాలిక్ అంశంగా కనిపిస్తూ కథలోని లోతైన అర్థాలను సూచిస్తోంది. తీగలతో కప్పబడ్డ భారీ కోట బ్యాక్‌డ్రాప్ సినిమా మరింత క్యురియాసిటీని పెంచింది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన రాగా, ఫస్ట్ సింగిల్ ‘ఓ సుందరి’ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. సత్యదేవ్, దీప థామస్‌లపై చిత్రీకరిం చిన ఈ మెలోడీ ఒక వింటేజ్ ప్రేమను అందంగా ప్రతిబింబిస్తూ, పీరియడ్ ఫీల్‌ను అద్భుతంగా చూపించింది. కథ, దర్శకత్వం, ఎడిటింగ్ అన్నీ బాధ్యతలను స్వయంగా తీసుకున్న వెంకటేష్ మహా తనదైన సెన్సిబిలిటీస్‌తో పాటు j¶నివర్సల్ ఎమోషన్స్‌ను కలిపిన కథను అద్భుతంగా తెరకెక్కించారు. రాయల్ విజువల్స్, మిస్టీరియస్ టోన్‌తో ‘రావు బహదూర్’ ప్రతి డీటేయిల్ లోతైన అర్థం దాగి ఉన్న ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లే చిత్రంగా రూపుదిద్దుకుంటోంది అని చిత్ర యూనిట్ తెలిపింది.
‘రావు బహదూర్’ రిలీజ్ డేట్ ఫిక్స్
- Advertisement -
- Advertisement -



