రెండు నియోజకవర్గాలలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన…

– పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులను పరిశీలన
– జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు
నవతెలంగాణ చివ్వేంల : సూర్యాపేట, కోదాడ నియోజకవర్గం లోని పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. బుధవారం  సూర్యాపేట నియోజకవర్గంలోని చివ్వెంల గ్రా,, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిఎస్ నెంబర్ 202,203 కలెక్టర్ పరిశీలించారు. చివ్వేంల  పరిధిలో గల 47 పోలింగ్ స్టేషన్ వివరాలను ఎ ఎం ఎఫ్, బి ఎం ఎఫ్ ల గురించి తహసీల్దార్  కృష్ణయ్య ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాలు ఉన్న పాఠశాలలో పనులు జరిగిన తర్వాత కొన్నిచోట్ల కంకర, రాళ్లు అలాగే వదిలి వేస్తున్నారని ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించి  పని పూర్తయిన వెంటనే తొలగించాలని కలెక్టర్ పేర్కొన్నారు. కోదాడ నియోజకవర్గం లోని మోతే మండలం నామవరం గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు పిఎస్ నెంబర్ 37 ,38 కలెక్టర్ పరిశీలించారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో వద్ద ర్యాంపు నిర్మాణం తప్పక ఉండాలని కనీస వసతులు ఏర్పాట్లు తాసిల్దార్లు పరిశీలించాలని ఒటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మోతే తహసీల్దార్  కె సంఘమిత్ర , ఎంపీడీవో సంతోష్ కుమార్, ఎంపీవోలు హరి సింగ్, గోపి, డిఈ పాండు, ఏఈలు మౌనిక, మణికంఠ, జనార్ధన్, ఆర్ఐ అజయ్, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love