నడిచే కాగడా

మనసు ఒంటరి తనాన్ని కోరుతుంది
గోడమీద బల్లిలా మాటేసిన పులిలా
మెదడు ఆలోచన గుహల్లోకి జారుతూ
మరేదో ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది
నన్ను స్వతంత్రున్ని చేస్తుంది
సామూహిక సంకెళ్ళ విముక్తిన్ని చేస్తుంది
నిశ్శబ్దం!
చెవిటి చెవులకు గుండె శబ్దాన్ని వినిపిస్తుంది
వడగాల్పుల ఊపిరి ఛాతిని పలకరిస్తుంది
నాలో ప్రశ్నల రణం ప్రభంజనం పుట్టిస్తుంది
సందేహాల శిలలపై నివత్తిని పరిష్కరిస్తుంది
నిశ్శబ్దమ్‌!
నిన్నటి నన్ను ఎదురుగా నిలబెడుతుంది
నా ఎదుగుదలను నిలదీస్తుంది
సమాధి స్థితినని పరిహాసిస్తుంది
భవిష్యత్తును ఛాతిమీద
చెమట చుక్కైగర్జిస్తుంది
నిశ్శబ్దం!
నన్ను నాకు పరిచయం చేస్తుంది
నా ఆశయాన్ని వెన్ను తట్టి గుర్తు చేస్తుంది
నేను నడిచే కాగడానని గుర్తుచేస్తుంది

– శివయ్య, 9676097519
సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌

Spread the love