గీతలు

linesకులం లేదు
మతం లేదు
వాడొక గీత గీశాడు
అందులో నిన్ను నన్ను తిప్పుతున్నాడు
ఇంకొకడు మరో గీత గీశాడు
అది నచ్చి నువ్వా బాట వెళ్తే
ఈ బాటలో నాతో ఇంకొందరు
ఆ బాటలో నీతో మరికొందరు
ఆ గీతకి లేని గొప్పని నువ్వంటగడితే
ఈ గీతకి లేని మహిమను నేను వంటబట్టిచ్చాను
ఆ కొందరు ఈ కొందరు వంత పాడారు
నా దారి గొప్పంటే నా దారి గొప్పంటు
నీ గీత కంటే నా గీత గొప్పంటు
నువ్వో కత్తి నేనో కత్తి
ఆ కొందరొక కర్ర ఈ కొందరొక కర్ర
గిరి గీసుకు బతికే బతుకుల్లో పొట్లాట
సర్కస్‌ జంతువుల్లా
ఎవడో చూపించిన రింగు దారిలోనే
దూకుల్లాటజి
నిన్ను చూసి నీ కొందరు
నన్ను నా చూసి నా కొందరు
నువ్వు నేను
ఆ గీత గీసిన వాడిని దేవుణ్ణి చేసి
స్వేచ్చా జీవితానికి సంకెళ్ళేసి
దేనికోసమో తెలియని పోరాటం చేస్తూ చస్తున్న ఏదో ఒక జాతి కానీ జాతి మనుషులం
మనుషులం……!!

– సురేంద్ర, 9346704966

Spread the love