పేక ముక్కలతో కోటలు కట్టి గిన్నిస్‌ రికార్డు కొట్టాడు

సోషల్‌ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో వింతలూ, విచిత్రాలకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. సాంగ్స్‌, డ్యాన్స్‌, సాహసకత్యాలు, వినూత్న ప్రయోగాలు చేస్తూ తమ ప్రతిభను చాటుకుంటూ వీడియోలు అప్‌ లోడ్‌ చేస్తున్నారు. అవి కాస్త క్షణాల్లో వైరల్‌ అవుతున్నాయి. దీంతో రాత్రి రాత్రే పాపులర్‌ అవుతున్నారు. తాజాగా ఓ కుర్రాడు పేక ముక్కలతో ఏకంగా గిన్నీస్‌ రికార్డు సష్టించాడు. వివరాల్లోకి వెళితే.. సాధారణంగా ఎవరైనా ఏదైనా అందరూ హర్షంచే ప్రయోగం చేయాలనుకుంటే.. గాల్లో పేక మేడలు కడుతున్నావా అంటూ హేళనగా మాట్లాడుతుంటారు. కానీ ఓ కుర్రాడు నిజంగా పేక ముక్కలతో ఏకంగా గిన్నీస్‌ రికార్డే సష్టించాడు. ఈ ఘనత సాధించిన కుర్రాడి వయసు పదిహేడు సంవత్సరాలు. కోల్‌కొతాకు చెందిన అర్నవ్‌ డాగా.. స్థానిక పాఠశాలలో పదవ తరగతి చదువుతు న్నాడు. చిన్నప్పటి ఎన్నో సజనాత్మక ప్రయోగాలు చేస్తూ అందరిచే శభాష్‌ అనిపించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే పేక ముక్కలతో ఓ బిల్డింగ్‌ కట్టాడు అర్నవ్‌. ఓ వైపు స్కూల్లో పాఠాలు చదువుతూ.. హూంవర్క్‌ చేస్తూ ఇంట్లో ఉన్న పేక ముక్కలతో ఏదైనా వినూత్న ప్రయోగం చేయాలని అనుకున్నాడు అర్నవ్‌. ఈ క్రమంలోనే పేక ముక్కలతో చిన్న చిన్న మేడలు కడుతూ ప్రాక్టీస్‌ చేస్తూ వచ్చాడు. గత ఏడాది రికార్డు కోసం ప్రయత్నించి విఫలం అయ్యాడు. కానీ పట్టువదలకుండా పేక ముక్కలతో 11 అడుగులకు పైగా ఎత్తు, 16 అడుగుల వెడల్పు, 40 అడుగుల పొడవుతో నాలుగు నిర్మాణాలు చి అతిపెద్ద నిర్మాణం కట్టి రికార్డు క్రియేట్‌ చేశాడు. దీనికోసం ఏకబిగిన 41 గంటల పాటు శ్రమించినట్లు అర్నవ్‌ తెలిపాడు. గతంలో పేక ముక్కలతో బ్రయాన్‌ బెర్గ్‌ అనే వ్యక్తి 34 అడుగుల 1 అంగుళం పొడవు, 9 అడుగుల 5 అంగుళాల ఎత్తు, 11 అడుగుల 7 అంగుళాల వెడప్పుతో మూడు మకావు హూటళ్ల ప్రతిరూపాలు క్రియేట్‌ చేసి రికార్డు సొంతం చేసుకు న్నాడు. ఇప్పుడు అర్నవ్‌ రూపొందించిన పేక మేడలతో బ్రయాన్‌ రికార్డు చెరిగిపోయింది. ప్రస్తుతం అర్నవ్‌ చేసిన పేక మేడలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Spread the love