పేదల కోసం పోరాడే యోధుడు

పవన్‌ కళ్యాణ్‌ తన కెరీర్‌లో మొదటిసారిగా ‘హరి హర వీర మల్లు’ అనే పీరియాడికల్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ సినిమాలో నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. 17వ శతాబ్దంలో పేదల పక్షాన పోరాడిన ఒక యోధుడి కథగా రూపొందుతోన్న ఈ యాక్షన్‌ అడ్వెంచర్‌ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం నుండి టీజర్‌ను విడుదల చేశారు. మొదటి భాగం ”హరి హర వీర మల్లు పార్ట్‌-1: స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌” పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ధర్మం కోసం యుద్ధం’ అనేది ఉపశీర్షిక. పేదలు దోపిడీకి గురవుతూ, ధనవంతులు మరింత అభివద్ధి చెందుతున్న ప్రాంతంలో.. న్యాయం కోసం యుద్ధం చేసే ఒంటరి యోధుడుగా పవన్‌ కళ్యాణ్‌ పోషిస్తున్న ‘హరి హర వీర మల్లు’ పాత్రను టీజర్‌ లో చూపించారు. ఈ పాత్ర తీరుని తెలుపుతూ బలమైన సంభాషణలు, ఆ సంభాషణలకు తగ్గట్టుగా అద్భుతమైన దశ్యాలతో రూపొందించిన తీరు కట్టిపడేసింది. కళ్ళు చెదిరే విజువల్స్‌, భారీ సెట్లు, కీరవాణి నేపథ్య సంగీతం ఒక గొప్ప అనుభూతిని అందించనున్నట్లు టీజర్‌ స్పష్టం చేసింది.

Spread the love