బీమ ఇవ్వకుండా ఆలస్యం.. ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ

– కలెక్టరేట్‌కు పెట్రోల్‌తో వచ్చిన మహిళ..
– ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు..
నవతెలంగాణ- సూర్యాపేట కలెక్టరేట్
కార్మికశాఖలో డెత్‌ బీమా కొరకు దరఖాస్తూ చేసుకుంటే అధికారులు దురుద్ధేశ్యంతో బీమా అందకుండా ఆపుతున్నారని చివ్వెంల మండలం ఐలాపురంకు చెందిన మహిళ బుడిగ నిర్మల ఆత్మహత్య చేసుకునేందుకు పెట్రోల్‌ బాటిల్‌తో జిల్లా కలెక్టరేట్‌కు వచ్చిన ఘటన శనివారం సూర్యాపేటలో చోటు చేసుకున్నది.ఇది గమనించిన పోలీస్‌లో కార్యాలయం ప్రదాన గేటు ముందే ఆమె వద్ద నుంచి పెట్రోల్‌ బాటిల్‌ లాగుకోవడంతో  ప్రమాదం తప్పిది.  అనంతరం అదనపు కలెక్టర్‌ వెంకట్‌రెడ్డిని కలిసి బాదితురాలు తెలిపిన వివరాల ప్రకారం ఐలాపురం గ్రామానికి చెందిన బాదితురాలి మామ బుడిగ  వెంకటయ్య కార్మికశాఖలో భవన నిర్మాణ కార్మికుడిగా లేబర్‌ కార్డు కలిగి ఉన్నాడు. అతను గత సంవత్సరం మరణించగా ఇన్సూరెన్స్‌ కోసం దరఖాస్తూ చేసుకున్నది. అయితే సూర్యాపేట అసిస్టెంట్‌ లేబర్‌ ఆపీసర్‌ ఇన్యూరెన్స్‌ అందకుండా అడ్డుపడుతున్నాడని తెలిపింది. దీనిపై స్పందిచిన అదనపు కలెక్టర్‌ దరఖాస్తూ పరిశీలించి బీమా అందించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
Spread the love