పట్టణ శివారులోని బ్రహ్మనపల్లి గ్రామంలో గల గాంధీనగర్ కి చెందిన నేరల్ల విజయ్ కుమార్ ఇటీవలే ఎల్ ఎల్ బి డిగ్రీ పూర్తి చేసి, తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యత్వ పత్రాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా బుధవారం విజయ్ కుమార్ మాట్లాడుతూ… పేదలకు, మారుమూల ప్రాంతం ప్రజలకు రాజ్యాంగ హక్కులను అందించడం తన బాధ్యతగా భావిస్తున్నానని, తన సేవలను పూర్తి బాధ్యతలతో నిర్వహిస్తానని తెలిపారు. ఇంతకు ముందు ఎల్ ఎల్ బి పూర్తి చేసిన విజయ్ కుమార్ 5సంవత్సరాలు రిపోర్టర్ గా ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకల, పజలకోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు న్యాయవాదిగా కూడా ప్రజలకు న్యాయ సేవలు అందించేల కృషి చేస్తానని అన్నారు.