ఫోన్‌ మాట్లాడొద్దన్నందుకు.. యువకుడు ఆత్మహత్య

నవతెలంగాణ-జవహర్‌నగర్‌
ఫోన్‌ తరచుగా మాట్లాడొద్దన్నందుకు యువ కుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన జవహర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసు కుంది. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సీతారాం తెలిపిన వివ రాల ప్రకారం జమ్మిగడ్డలోని శివసాయి నగర్‌ కాలనీలో అద్దె ఇంట్లో జరు మేనకా నాయక్‌, భర్త మున్నా నాయక్‌, కుమారుడు అనిల్‌(18)తో కలిసి నివసిస్తున్నారు. ఒరిస్సా రాష్ట్రం నుంచి ఉపాధి కోసం వచ్చి సెంట్రింగ్‌ పనులు చేసుకుంటూ మున్నానాయక్‌ జీవనం సాగించేవాడు. కొంత కాలంగా కుమారుడు అనిల్‌ ఫోన్‌లో తరచుగా మాట్లాడుతుంటే తల్లి మేనకానాయక్‌ వద్దని వారిం చింది. ఆదివారం తల్లిదండ్రులు పనుల కోస ం వెళ్ళగా, అనిల్‌ ఇంట్లోనే ఉండి సీలింగ్‌ రాడ్డుకు నైలాన్‌ వైర్‌తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకు న్నాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి తల్లి తలుపులు తీయమని పలుమార్లు ఫోన్‌ చేసిన స్పందించలేదు. దాంతో చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు తెరచి చూడగా అనిల్‌ అప్పటికే విగతజీవిగా కనిపించాడు. పోలీసులకు సమాచారం అందిం చగా మతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ దవాఖానాకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love