Thursday, July 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరెడ్కో డీఈ ఆస్తులపై ఏసీబీ రైడ్

రెడ్కో డీఈ ఆస్తులపై ఏసీబీ రైడ్

- Advertisement -

అవినీతి విద్యుత్ అధికారి
అక్రమాస్తుల విలువ రూ. వంద కోట్ల పైనే
రెడ్కో డివిజనల్ ఇంజనీర్ ఆస్తుల పై ఏసీబీ దాడులో వెలడి .

నవతెలంగాణ ప్రత్యేక-ప్రతినిధి
రాష్ట్రంలో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ( రెడ్కో) లో డీఈ గా పని చేస్తున్న ముత్యం వెంకట రమణ అక్రమాస్తులపై ఏసీబీ అధికారులు బుధవారం జరిపిన ఆకస్మిక దాడుల్లో కోట్లాది రూపాయల అక్రమాస్తుల గుట్టు రట్టు అయింది. అతని ఇంటి తో పాటు అతని కుటుంబ సభ్యులు, బినామీలకు చెందిన మరో ఏడు ప్రాంతాల పై ఏసీబీ దాడులు నిర్వహించినటూ ఈ విభాగం డైరెక్టర్ జనరల్ చారు సిన్హా తెలిపారు . ఆమె తెలిపిన వివరాల ప్రకారం ఈ దాడులో కూకట్పల్లి శేరిలింగంపల్లి లలో నాలుగు రెసిడెంటిల్ ఫ్లాట్స్,కూకట్పల్లి అంజేయ నగర్ జీ + 3 భావనం,గుట్టల బేగంపేట్ లో ఐదు అంతస్తుల భవనం ను వెంకట రమణ కలిగి ఉన్నటు ఏసీబీ అధికారులు కనుగొన్నారు. అలాగే అతని భార్య పేరిట నాలుగు భవన నిర్మాణా సమస్తాలు కలిగి ఉన్నటూ కూడా తేలింది .అలాగే నిందితుడు కూకట్పల్లి అంజేయ నగర్ లోన్ రూ. 20 కోట్ల తో పది అపార్ట్మెంట్ లను నిర్మించినటూ ఏసీబీ తేల్చింది. ఈ సోదాలోనే వెంకట రమణ రూ.52,02,585 లక్షల బ్యాంకు బాలన్స్ , రూ.40 లక్షల విలువైన బంగారు నగలు, రూ.45 లక్షల విలువైన కియా, మహీంద్రా, బాలెనో కార్ లను, రూ.30 లక్షల విలువైన గృహోపకరణ వస్తువులు,20 విదేశీ మద్యం బాటిల్స్ లను కూడా వెంకట రమణ కలిగి ఉన్నట ఏసీబీ సోదాలో తేలింది. గతం లో కూడా వెంకట రమణ 25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ కి చికాడు. ఇతని అక్రమాస్తుల విలువ ప్రాథమికంగా రూ. 28,14,14,700 కోట్లు గా అంచనా వేసినా అధికారులు వాటి ప్రస్తుత బహిరంగ మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైనే ఉంటుందని అధికారులు భావిస్తున్నరు. నిందితుదిని అరెస్ట్ చేసి తదుపరి దరియాప్తును సాగిస్తున్నటు అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -