- Advertisement -
నవతెలంగాణ-మల్హర్‌రావు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండలం చిన్నతూండ్ల గ్రామంలో మంగళవారం సర్పంచ్ గడ్డం క్రాoతి ఆధ్వర్యంలో చేయుత పింఛన్ల కోసం దరఖాస్తులను స్వీకరించారు. ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా జూన్ 2 నుంచి కొత్తగా అర్హులైన వారికి చేయుత పింఛన్లు మంజూరు చేస్తున్న నేపథ్యంలో దరఖాస్తులను స్వీకరించారు. వితంతు,వృద్ధులు,వికలాంగులు తదితర అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లు వస్తాయని,ఎవరు ఆందోళన చెందవద్దని ఈ సందర్భంగా సర్పంచ్ సూచించారు.
- Advertisement -



