అందుబాటులోకి అరణ్య అర్బన్ పార్క్

నవతెలంగాణ – మాక్లూర్

నిజామాబాద్, ఆర్మూర్ ప్రాంత ప్రజలకు వేసవి సెలవుల్లో చిన్నారులతో గడపడానికి 63వ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన అరణ్య అర్బన్ పార్క్ అందుబాటులోకి వచ్చింది. ఇది మాక్లూర్ మండలంలోని చిన్నపూర్, మామిడిపల్లి గ్రామాల సరి హద్దుల్లో గల అటవీశాఖ భూమిలో సుమారు 400 ఎకరాలు, 5 కిలోమీటర్ల పొడవు గల పార్కు ఉందని అధికారులు తెలుపుతున్నారు.
అందుబాటులోకి: నిజామాబాద్ జిల్లా కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలోనే  జిల్లా అరణ్య అర్బన్ పార్క్ ఉంది. అటు ఆర్మూర్, ఇటు నిజామాబాద్ రహదారిపై అందుబాటులోనే ఉండటంతో పర్యాటకుల సందడి బాగానే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.  వేసవిలో ప్రజలు పార్కులో ఆనందంగా గడపడానికి వచ్ టవర్, గార్డెన్, చిల్డ్రన్ పార్క్, త్రాగు నీరు, ఓపెన్ గ్లాస్ రూం, ఓపెన్ జిమ్, సుమారు 20 కెమెరాలకు అమర్చారు. సఫారీ, సైక్లింగ్ కూడా కొద్ది రోజుల్లో ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
అందుబాటులోనే ఎంట్రీ పిజ్: సువిశాలమైన పార్క్ ను ఏర్పాటు చేసిన సందర్ష్కులకు ఎంట్రీ పిజు పెద్దలకు రూ. 20, పిల్లలకు రూ. 10 చొప్పున వసూలు చేస్తున్నారు. అంతే కాకుండా పోటో షూట్ రూ. 1000, నెల పస్ రూ. 1500. వాకర్స్ నెల పాస్ 300, అర్థ సంవత్సరం రూ. 1200, సంవత్సరం రూ. 2000, లైఫ్ టైం పాస్ రూ. 10000 చొప్పున ఏర్పాటు చేశారు. అరణ్య అర్బన్ పార్క్ అందుబాటులో ఉందని, పర్యాటకులు వచ్చి సందర్శించ వచ్చని అధికారులు తెలిపారు.
Spread the love