రూ.377.68 కోట్లకు చేరిన ఎన్నికల సొత్తు స్వాధీనాలు

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించి, నిబంధనావళి అమల్లోకి వచ్చిన అక్టోబర్‌ 9 నుంచి 28వ తేదీ వరకు ఎన్నికల సంఘం నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడిన సొమ్ము విలువ రూ.377.68 కోట్లకు చేరింది. ఈనెల 27 ఉదయం 9 నుంచి 28వ తేదీ ఉదయం 9 గంటల వరకు జరిపిన తనిఖీల్లో రూ.5.32 కోట్ల నగదు, రూ.6.11 కోట్ల విలువైన మద్యం, రూ.58.27 లక్షలు విలువైన 83.816 కిలోల గంజాయి, 43.75 కిలోల ఎన్‌డీపీఎస్‌ స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.19.13 లక్షలు విలువైన బంగారం, వెండితో పాటు రూ.1.65 కోట్లు విలువైన ల్యాప్‌టాప్‌లు, వాహనాలు, కుక్కర్లు, చీరలు, మొబైల్‌ ఫోన్లు, క్రీడా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది.

Spread the love